వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme
240W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మొట్టమొదటి ఫోన్ రాబోతుంది. అదే Realme సంస్థ విడుదల చేయనున్న GT Neo 5. టెక్నాలజీ కమ్యూనికేషన్ సమావేశంలో జనవరి 5, 2023న తన ఫ్లాష్-చార్జింగ్ ఆవిష్కరణను ఆవిష్కరించబోతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, Realme 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఉన్న GT Neo 3ని విడుదల చేసింది, ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి ఆదరణ లభించింది. Realme GT Neo 5 టాప్-సెంటర్డ్ పంచ్-హోల్ కట్-అవుట్, స్లిమ్, సిమెట్రిక్ బెజెల్స్, ప్లాస్టిక్ బాడీ, అండర్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి సౌకర్యాలతో వస్తుంది. వెనుకవైపు, పూర్తి-వెడల్పు కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తున్న GT Neo 5
ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 2,160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.7-అంగుళాల QHD+ (1240x2772 పిక్సెల్‌లు) AMOLED ప్యానెల్ ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వచ్చే అవకాశం ఉంది, 5,000mAh మోడల్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తే, 4,600mAh మోడల్ 240W ఫ్లాష్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. Realme GT Neo 5 లాంచ్ అయిన తర్వాత ధర ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే GT Neo 3 ప్రారంభ ధర రూ. 36,999. ఈ ఫోన్ కూడా ఇంచుమించు అదే ధర ఉండచ్చు.