Loading...
Hong Kong Sixes 2026: ఆస్ట్రేలియాకు షాక్.. హాంకాంగ్ సిక్సెస్ 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్!
ఆస్ట్రేలియాకు షాక్.. హాంకాంగ్ సిక్సెస్ 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్!

Hong Kong Sixes 2026: ఆస్ట్రేలియాకు షాక్.. హాంకాంగ్ సిక్సెస్ 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్ఘన్ జట్టు తొలిసారి ఈ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గుల్బదిన్ నయీబ్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి, భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. హాంకాంగ్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ ఈ ఫైనల్ పోరుకు వేదికైంది.

వివరాలు

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 115 పరుగులు

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాక్స్ బ్రయంట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 14 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఫోర్ల సాయంతో 44 పరుగులు సాధించాడు.

మరోవైపు అలెక్స్ రాస్ కూడా ధాటిగా ఆడాడు. కేవలం 10 బంతుల్లోనే అజేయంగా 29 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ ముందు 116 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది.

116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు వికెట్లు త్వరగా కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది.

వివరాలు

ఇమ్రాన్ మీర్, ఫర్మానుల్లా సఫీ విధ్వంసం

అయితే ఇమ్రాన్ మీర్, ఫర్మానుల్లా సఫీ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్థాన్ వైపు తిప్పారు.

ఇమ్రాన్ మీర్ కేవలం 14 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా ఫర్మానుల్లా సఫీ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

కేవలం ఏడు బంతులు ఎదుర్కొన్న అతడు నాలుగు సిక్సర్లతో 26 పరుగులు సాధించాడు. కెప్టెన్ గుల్బదిన్ నయీబ్ సైతం తన వంతుగా ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు.

వీరి ధాటికి ఆఫ్ఘనిస్థాన్ కేవలం 5.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి, తొలిసారి హాంకాంగ్ సిక్సెస్ టైటిల్‌ను అందుకుంది.

ADVERTISEMENT

వివరాలు

టోర్నీలో భారత్‌కు నిరాశ

మరోవైపు హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

గ్రూప్-సి దశలో పాకిస్థాన్, యూఏఈ చేతిలో ఓటమిపాలై టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత జరిగిన బౌల్ సెమీఫైనల్లోనూ ఇంగ్లండ్ చేతిలో పరాజయం ఎదురైంది.

చివరగా 11వ స్థానం కోసం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు చేతిలో ఉండగానే ఛేదించింది.

దీంతో భారత జట్టు టోర్నీలో 11వ స్థానంతో సరిపెట్టుకోగా, బంగ్లాదేశ్ 12వ స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT