Page Loader
10 బంతుల్లో 5 నో బాల్స్.. అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు
బౌలింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్

10 బంతుల్లో 5 నో బాల్స్.. అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2023
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ పేసర్ అర్షదీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కేవలం 10 బంతుల్లో 5 నోబాల్స్ వేశాడు. దీంతో ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక నోబాల్స్ వేసిన భారత్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. దీంతో టీ20 చరిత్రలో హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన భారత్ తొలి బౌలర్‌గా నిలిచాడు. రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ వేయడంతో శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్‌కు వరంలా మారింది. ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులిచ్చాడు. కెప్టెన్ హార్దిక్ హర్షదీప్‌కు బౌలింగ్ ఇవ్వడానికి భయపడ్డారు.

అర్షదీప్ సింగ్

నోబాల్స్ వేయడంపై దినేష్ కార్తీక్ ట్వీట్

మళ్లీ 19వ ఓవర్ వేయడానికి వచ్చిన అర్షదీప్.. అప్పుడు కూడా అదే సీన్ ను రిపీట్ చేసి చిరాకు పుట్టించాడు. ఆ ఓవర్లోనూ వరుసగా రెండు నోబాల్స్ వేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో మొత్తం 5 నోబాల్స్ వేయడంతో ప్రస్తుతం హర్షదీప్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనారోగ్యం కారణంగా తొలి టీ20 ఆడని అర్షదీప్.. ఈ మ్యాచ్‌లో హర్షల్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. కానీ అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఈ కారణంతోనే అర్షదీప్ నోబాల్స్ వేశాడని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేయడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అర్షదీప్ కి సపోర్ట్ గా దినేష్ కార్తీక్ ట్వీట్