
ఆసియా గేమ్స్ 2023లో ఇండియాకు పతకాల పంట, ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వరుస పతకాలతో దూసుకెళ్తోంది.
తొలి రోజు రెండు పతకాలను కైవసం చేసుకున్న ఇండియా, ఈరోజు మరో మూడు పతకాలను గెలుచుకుంది. దాంతో ఇప్పటివరకు ఆసియా గేమ్స్ 2023లో ఐదు పతకాలను భారత్ కైవసం చేసుకుంది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహిళల క్రికెట్ లో సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా, రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఫైనల్ లో గెలిస్తే ఇండియాకు స్వర్ణం దక్కుతుంది. అంటే ప్రస్తుతం ఇండియా ఖాతాలో ఆరు పతకాలు చేరినట్లే.
Details
ఏయే క్రీడల్లో పతకాలు వచ్చాయంటే?
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో , రమిత, మెహులి ఘోష్, ఆషి చౌక్సి బృందానికి సిల్వర్ మెడల్ దక్కింది.
పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ రోయింగ్ లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ బృందానికి రజత(silver) పతకం దక్కింది.
8మంది జట్టు గల పురుషుల రోయింగ్ లో ఇండియాకు సిల్వర్ మెడల్ దక్కింది. అలాగే పురుషుల రోయింగ్ పెయిర్ ఈవెంట్ లో, బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ లకు బ్రాంజ్ మెడల్ దక్కింది.
చివరగా మహిళల 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రమితకు కాంస్య(bronze) పథకం దక్కింది.