LOADING...
Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్ 
Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్

Australian Open: బబ్లిక్‌ను ఓడించి 35 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సుమిత్ నాగల్ 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్ మంగళవారం రెండో రౌండ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించాడు. నాగల్ 6-4, 6-2, 7-6 తేడాతో ప్రపంచ 27వ ర్యాంకర్ కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బబ్లిక్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మూడేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో సుమిత్ నాగల్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అంతకుముందు, అతను యూఎస్ ఓపెన్ 2020లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇది కాకుండా, 35 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన తొలి భారతీయ టెన్నిస్ ఆటగాడిగా సుమిత్ నాగల్ నిలిచాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్

1989 తర్వాత మళ్లీ నాగల్‌దే రికార్డు

సుమిత్ నాగల్ కంటే ముందు, 1989లో, రమేష్ కృష్ణన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మ్యాట్స్ విలాండర్‌ను ఓడించాడు. ఆ తర్వాత గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన ప్లేయర్‌గా నాగల్ చరిత్ర సృష్టించాడు. సుమిత్ నాగల్ రెండో రౌండ్‌లో చైనీస్ వైల్డ్ కార్డ్ విజేత జున్‌చెంగ్ షాంగ్, మెకెంజీ డొనాల్డ్‌లతో తలపడతాడు. 26 ఏళ్ల నాగల్ బబ్లిక్‌పై అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. నాగల్ ర్యాంకింగ్ ప్రస్తుతం 137 కాగా.. అతని కంటే 110 స్థానాలు ముందున్న 27వ ర్యాంక్‌లో ఉన్న బబ్లిక్ ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు.