మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు
చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్ లు ఆడిన చైన్నై ఆరు విజయాలను సాధించింది. దీంతో ఆరు పాయింట్ల సంపాదించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చైన్నై చేరుకుంది. నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించిన రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది.
మొదటి స్థానంలో యుజేంద్ర చాహల్
చైన్నైపై బౌండరీలతో విరుచుకుపడ్డ కెప్టెన్ డుప్లెసిస్ ఆరంజ్ క్యాప్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన డుప్లెసిస్ 259 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 234 పరుగులతో వెంకటేష్ అయ్యర్ రెండో స్థానంలో, 233 రన్స్ తో శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. పర్పుల్ క్యాప్ లిస్టులో యథావిధిగా రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. చాహల్, మార్క్‌వుడ్, రషీద్ ఖాన్ 11 వికెట్లతో సమానంగా ఉన్నప్పటికీ తక్కువ ఎకానమీ రేటుతో చాహల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.