Loading...
Colombo Test, Day 4: పట్టుదలగా పోరాడుతున్న శ్రీలంక.. గెలుపుపై భారత్ కన్ను
పట్టుదలగా పోరాడుతున్న శ్రీలంక.. గెలుపుపై భారత్ కన్ను

Colombo Test, Day 4: పట్టుదలగా పోరాడుతున్న శ్రీలంక.. గెలుపుపై భారత్ కన్ను

వ్రాసిన వారు Moogati Shabari
Aug 26, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో ఆతిథ్య జట్టు పట్టుదలగా పోరాడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేయగా.. శ్రీలంక 290 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫాలోఆన్ విధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. పసిందు సూరియబండార, కమిందు మెండిస్ కలిసి 115 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

వివరాలు

ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్..

మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

ఓవర్‌నైట్ స్కోరుతో సోనల్ దినుష (85 నాటౌట్), లహిరు కుమార (8 నాటౌట్) నాలుగో రోజు ఆటను ప్రారంభించారు.

ఈ క్రమంలో దినుష సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక మరికొన్ని పరుగులు జోడిస్తున్న సమయంలో అరంగేట్రం చేసిన సారాంశ్ జైన్.. లహిరు కుమార, సోనల్ దినుషలను ఔట్ చేసి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

జైన్ 20.4 ఓవర్లలో 69 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 52 పరుగులకు మూడు వికెట్లు, మానవ్ సుతార్ 85 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టారు.

వివరాలు

భారత్‌పై చారిత్రక టెస్టు సెంచరీ..

శ్రీలంక చివరి వికెట్‌గా సోనల్ దినుష ఔటయ్యాడు. అతడు 162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు.

అంతకుముందు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులోనూ దినుష ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించాడు.

దీంతో భారత్‌పై ఆడిన తొలి రెండు టెస్టుల్లోనే రెండుసార్లు సెంచరీలు చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా దినుష నిలిచాడు.

అంతకుముందు ఈ ఘనత దులీప్ మెండిస్‌కు మాత్రమే ఉంది.

ADVERTISEMENT

వివరాలు

మరో రికార్డు సృష్టించిన దినుష..

భారత్‌తో వరుస టెస్టుల్లో సెంచరీలు చేసిన శ్రీలంక బ్యాటర్ల జాబితాలో దినుష ఏడో ఆటగాడిగా నిలిచాడు.

ఈ జాబితాలో అరవింద డి సిల్వా (1997), కుమార సంగక్కర (2009-2010), సనత్ జయసూర్య (1997), మహేల జయవర్ధనే (2001), తరంగ పరనవితాన (2010), ఏంజెలో మాథ్యూస్ (2015) ఉన్నారు.

వీరి సరసన ఇప్పుడు సోనల్ దినుష కూడా చేరాడు.

ADVERTISEMENT