PCB: 194 పరుగుల తేడాతో ఘోర పరాజయం.. పాక్ జట్టులో సంచలన మార్పులు, ఏడుగురు ఆటగాళ్లపై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వరుస పరాజయాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో భారీ మార్పులకు దారితీశాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన వెంటనే.. సిరీస్ మధ్యలోనే జట్టును ప్రక్షాళన చేసేందుకు పీసీబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడంతో పాటు, రెడ్-బాల్ కోచింగ్ సిబ్బందిలోనూ కీలక మార్పులు చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్, పరిమిత ఓవర్ల క్రికెట్ మాజీ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు అలీ ఉస్మాన్, అమీర్ జమాల్, ముహమ్మద్ అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్‌లను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.
వివరాలు
ఏడుగురికి అవకాశం
వీరి స్థానంలో ఏడుగురు కొత్త ఆటగాళ్లను టెస్ట్ జట్టులోకి ఎంపిక చేసింది.
సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్‌కు ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో అనుభవం ఉండగా.. అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్, రజావుల్లాలకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది.
ఆటగాళ్ల మార్పులతో పాటు కోచింగ్ సిబ్బందిపైనా పీసీబీ చర్యలు తీసుకుంది. టెస్ట్ క్రికెట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను వారి బాధ్యతల నుంచి తప్పించింది.
వారి స్థానంలో ప్రస్తుత పర్యటన ముగిసే వరకు వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్, యాష్లే నోఫ్కేలకు అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ ఇప్పటికే 0-2తో వెనుకబడింది.
వివరాలు
సెప్టెంబర్ 9న మూడో టెస్టు
ఆటగాళ్ల పేలవమైన ఫామ్‌తో పాటు గాయాలకు సంబంధించిన వివాదాలు కూడా ఈ భారీ మార్పులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఇక ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య సిరీస్‌లో మూడో టెస్ట్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే సిరీస్ కోల్పోయే దశకు చేరుకున్న పాకిస్థాన్.. చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.