Page Loader
చెల్సియాను చిత్తు చేసిన  డార్ట్మండ్
చెల్సియాపై విజయం సాధించిన డార్ట్మండ్

చెల్సియాను చిత్తు చేసిన డార్ట్మండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్ లో డార్ట్మండ్ విజయం సాధించింది. చెల్సియాను 1-0తో తేడాతో ఓడించింది. మొదటి అర్ధభాగం వరకు ఇరువురు గోల్స్ సాధించడంలో విఫలమయ్యారు. అయితే 63వ నిమిషంలో కరీమ్ అడెయెమి ఆతిథ్య డార్ట్మండ్ జట్టుకు గోల్ చేశాడు. 78వ నిమిషంలో చెల్సియా గోల్ చేయడానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డార్ట్మండ్, చెల్సియా మధ్య యూరోపియన్ పోటీలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో డార్ట్‌మండ్ చివరకు విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. చెల్సియా తమ చివరి 12 గేమ్‌లలో కేవలం మూడింటిని మాత్రమే గెలిచింది. ఛాంపియన్స్ లీగ్‌లో డార్ట్‌మండ్ చివరి 22 మ్యాచ్‌లో కేవలం నాలుగింటిని మాత్రమే ఓడింది.

బెన్‌ఫికా

క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన బెన్‌ఫికా

చెల్సియా 21సార్లు ప్రయత్నాలు చేయగా.. 8సార్లు లక్ష్యాన్ని చేరుకుంది. డార్ట్‌మండ్ 14సార్లు ప్రయత్నించగా.. కేవలం రెండుసార్లు లక్ష్యానికి చేరుకుంది. చెల్సియా 53శాతం బంతిని కలిగి ఉండగా.. 86శాతం పాస్ ఖచ్చితత్వాన్ని సాధించింది. చెల్సియా 10 కార్నర్‌లు సాధించడం విశేషం. మరో మ్యాచ్‌లో క్లబ్ బ్రూగ్‌ను బెన్‌ఫికా ఓడించి, క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. బెన్‌ఫికా తమ చివరి ఎనిమిది ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. 2005-06 తర్వాత మొదటిసారిగా ఈ పోటీలో మూడు వరుస మ్యాచ్‌లను బెన్‌ఫికా గెలుచుకుంది.