Page Loader
WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత
కన్నుమూసిన బెల్లిగ్రహం

WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2023
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం(79) కన్నుమూశాడు. మాజీ ప్రో రెజ్లర్ తీవ్ర అనారోగ్యంతో చాలా కాలంగా ఆస్ప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించలేదు. జూన్ 7న 80వ పుట్టిన రోజు జరుపుకోవడానికి ముందుగా అతను మరణించడంపై అతని అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అరిజోనాలోని ఫీనిక్స్‌లో జన్మించిన బిల్లీ గ్రహం అసలు పేరు ఎల్‌డ్రిడ్జ్ వేన్ కోల్‌మన్. అతను ఐదో తరగతిలో ఉన్నప్పుడే రెజ్లింగ్ పట్ల అకర్షితులైనాడు.

Details

నైట్ క్లబ్ లలో బౌన్సర్ గా పనిచేసిన బిల్లీ గ్రహం

చిన్న వయస్సు నుండి వివిధ రకాల క్రీడల్లో అతను నాటుతేలాడు. ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి షాట్‌పుట్ ఛాంపియన్ అయ్యాడు. తరువాత కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో కొన్ని మ్యాచులు ఆడాడు. నైట్‌క్లబ్‌లలో బౌన్సర్‌గా కూడా అతను పనిచేసిన విషయం తెలిసిందే. 1960లో కోల్‌మన్ ప్రో రెజ్లింగ్‌లో చేరాడు. 1977-78లో ప్రపంచ ఛాంపియన్ ప్రొఫెషనల్ రెజ్లర్ ట్యాగ్‌ని మూడుసార్లు గెలుచుకొని రికార్డు సృష్టించాడు. 2004లో, అతను WWEలో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు. అతని చివరి మ్యాచ్ నవంబర్ 7, 1987న సెయింట్ లూయిస్‌లో జరిగిన WWF లైఫ్ ఈవెంట్‌లో బుచ్ రీడ్ చేతిలో ఓడిపోయాడు