
Ashish Nehra: బుమ్రా వేలంలోకి వచ్చి ఉంటే.. ఎన్ని కోట్లు ఉన్నా సరిపోవు.. నెహ్రా
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు వర్షం కురిపించాడు.
బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే ఏ ఫ్రాంచైజీ అయినా అతడిని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుందని, ఫ్రాంచేజీ వద్ద ఉన్న మొత్తం బడ్జెట్ కూడా సరిపోదని ఆయన అభిప్రాయపడ్డాడు.
2013లో ముంబై ఇండియన్స్ తన జట్టులోకి తీసుకున్న బుమ్రా, అప్పటి నుంచి టీమ్‌లో కీలక బౌలర్‌గా మారాడు. 11 ఏళ్లుగా ముంబై జట్టు అతడిని వేలంలోకి విడిచిపెట్టలేదు.
దీంతో బుమ్రాకు ఉన్న క్రేజ్ ఎంటో అర్థమవుతుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో తొలి టెస్టు మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్‌గా చేసిన అద్భుత ప్రదర్శన క్రికెట్ ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిదాయకమైంది.
Details
బుమ్రాను రిటైన్ చేసుకున్న ముంబయి ఇండియన్స్
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడంతో బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు.
తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటుతూ ఆస్ట్రేలియాపై విజయం సాధించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత జట్టుకు బుమ్రా తన నాయకత్వంతో మళ్లీ జోష్ ఇచ్చాడు.
కెప్టెన్‌గా ఒత్తిడి బాగా ఉన్నప్పటికీ, తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించి, జట్టును విజయపథంలో నడిపించాడు.
బుమ్రా ఐపీఎల్ వేలంలో ఉంటే ఫ్రాంచైజీలు అతడిని సొంతం చేసుకోవడానికి ఏవైనా అద్భుతాలు చేసి ఉండేవని, అతడిని తీసుకోవడానికి రూ.520 కోట్ల పర్స్ కూడా సరిపోదన్నారు.
ముంబయి ఇండియన్స్ అతడిని రూ.18 కోట్లకు రిటైన్ చేయడం చాలా కీలక నిర్ణయమని నెహ్రా చెప్పుకొచ్చాడు.