IND Vs BAN :55వ హాఫ్ సెంచరీ తో బంగ్లాదేశ్ ను ఆకట్టుకున్న షకిబుల్ హసన్
2023 ఆసియా కప్‌లో చివరి సూపర్ ఫోర్ పోరులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌పై అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు. శార్దూల్ ఠాకూర్ దెబ్బకి ఒక దశలో బాంగ్లాదేశ్ 44 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన ఈ అల్ రౌండర్ వన్డేల్లో 55వ అర్థ శతకం బాదాడు. షకిబ్ 55 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 రన్స్ చేశాడు. అంతేకాకుండా మెహిదీ హసన్ మిరాజ్(13), తౌహిద్ హృదోయ్(28 నాటౌట్)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఈ ఏడాది వన్డేల్లో 500 పరుగుల మార్క్‌ను దాటాడు
తన 240వ వన్డే ఆడుతున్న షకీబ్ సగటు 37.67తో 7,384 పరుగులకు చేరుకున్నాడు. షకీబ్ తన కెరీర్ లో 55వ ODI అర్ధశతకం అలాగే అత్యధిక స్కోరు 134*. ఇతను ఇప్పటివరకు తొమ్మిది సెంచరీలను చేశాడు. షకీబ్ ఎడమ చేతి స్పిన్‌తో, బంగ్లాదేశ్ కెప్టెన్ గా 4.44 అద్భుతమైన ఎకానమీతో 307 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా, షకీబ్ ఈ ఏడాది వన్డేల్లో 500 పరుగుల మార్క్‌ను దాటాడు. 2023లో తన 16వ వన్డే ఆడుతున్న అతను 39.21 సగటుతో 549 పరుగులకు చేరుకున్నాడు. ఈ ఏడాది అతనికి ఇది ఐదో యాభై. బంతితో 34.15 సగటుతో 16 వికెట్లు తీశాడు.