Page Loader
శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు
రెండో వన్డేలో మూడు వికెట్లు తీసిన కుల్దీప్

శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో భారత్ రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ భారత్ బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 215 పరుగలకు అలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లు ఫెర్నాండ్ (50), మెండిస్ (32) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్ మెన్స్ విఫలం కావడంతో శ్రీలంక తక్కువ స్కోర్ కే పరిమితమైంది. భారత్ బౌలర్లు కులదీప్ యాదవ్ మూడు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, ఉమ్రాన్ రెండు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్ల నడ్డి విరిచారు. ముఖ్యంగా చాహెల్ స్థానంలో వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

భారత్

భారత్ టార్గెట్ 216

శ్రీలంక తరుపున అరంగ్రేటం చేసిన ఫెర్నాండో అర్ధ సెంచరీ చేసి చేలరేగాడు. కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్‌కు దిగిన తర్వాత శ్రీలంక గొప్పగా అరంభించింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండోలు బ్యాటింగ్ కు దిగారు. ఆరో ఓవర్లో అవిష్కను సిరాజ్ అవుట్ చేశాడు. అనంతరం మెండిస్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లకు శ్రీలంక స్కోరు 51పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. కుల్దీప్ తన అద్భుతమైన బౌలింగ్ తో మెండిస్, చరిత్ అసలంక, కెప్టెన్ షనక (3/51)లను అవుట్ చేసి భారత్‌కు శుభారంబాన్ని అందించాడు. దీంతో కుల్దీప్ 200 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.