South Africa vs India: మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా భారీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టానికి 16.4ఓవర్లలోనే విజయవంతంగా ఛేదించింది.
యాస్ అయ్యర్, అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ 5, అవేష్ ఖాన్ 4 వికెట్లతో రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు 116 పరుగులకే కుప్పకూలింది.
అర్ష్‌దీప్ వన్డేల్లో 5వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన మూడో భారతీయుడిగా అర్ష్‌దీప్ నిలిచాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8వికెట్ల తేడాతో విజయం
India beat South Africa by 8 wickets in the first ODI to go 1-0 up in three-match series.
— ANI (@ANI) December 17, 2023
(Pic: BCCI) pic.twitter.com/egUkCsrupp