
అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్
ఈ వార్తాకథనం ఏంటి
క్రీడలతో పాటు చదువుల్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైస్వాల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆమె డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏపీలోని రాజమహేంద్రవరం అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి ఆమె డాక్టరేట్ ను అందుకున్నారు.
22 ఏళ్లకే డాక్టరేట్ పట్టా అందుకున్న పిన్న వయసు భారతీయురాలిగా అమె అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 'మహిళా సాధికారతతో మైక్రోఫైనాల్స్ పాత్రపై అధ్యయనం' అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేసింది.
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా ఇప్పటికే ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లను అందుకున్న విషయం తెలిసిందే.
Details
చదువుల్లోనూ సత్తా చాటుతున్న నైనా నెహ్వాల్
ఎనిమిదేళ్లకే పదో తరగతిని నైనా నెహ్వాల్ కంప్లీట్ చేసింది. 13 ఏళ్లకు గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్ లో డిగ్రీ పొందింది. అదే విధంగా మోటివేషనల్ స్పీకర్ గా తనకంటూ నైనా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
తన తల్లిదండ్రులు అశ్వాని జైస్వాల్, భాగ్యలక్ష్మి సహకారంతో ఈ స్థాయికి ఎదిగానని, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగితే ఆ సాధ్యమన్నది ఏమీ లేదన్నారు.
ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎం. ముత్యాల నాయుడు అభినందించిన విషయం తెలిసిందే.