భారత్‌తో టీ20 సిరీస్ జట్టును ప్రకటించిన కివిస్, కొత్త కెప్టెన్ ఇతడే
టీమిండియాతో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్‌కు అప్పగించారు. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశీలీగ్‌లో అద్భుతంగా రాణించినా హెన్రీ షీప్లే, బెన్ లిస్టర్ తొలిసారిగా టీ20లో అరంగ్రేటం చేయనున్నారు. ఈ మ్యూడు టీ20 మ్యాచ్ లు రాంచీ, లక్నో , అహ్మదాబాద్ లో జరగనున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లిస్టర్ గతేడాది భారత్ పర్యటించిన న్యూజిలాండ్ ఏ లో సభ్యుడు. ఆ సీజన్లో లిస్టర్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.ఇటీవలే పాకిస్తాన్‌పై వన్డేల్లో హెన్రీ షిప్లీ అరంగ్రేటం చేశాడు.
భారత్‌తో తలపడే కివిస్ జట్టు ఇదే
పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో మిచెల్ సాంట్నర్ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో అతడికి కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. న్యూజిలాండ్ T20I జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రిప్పన్, హెన్సీ రిప్పన్, హెన్సీ రిప్పన్, బ్లెయిర్ టిక్నర్.