సరిగ్గా ఇదే రోజు.. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ అరంగ్రేటం
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన స్పిన్ మాయజాలంలో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కులు చూపించిన లెజెండ్.. తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1992 సరిగ్గా ఇదే రోజున షేన్ వార్న్ భారత్- ఆస్ట్రేలియా తరపున భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. టెస్టులో అత్యధిక వికెట్లు (708) తీసిన రెండో బౌలర్ గా చరిత్రకెక్కారు. ఇంతకు ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్టు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. 700 వికెట్ల మార్కును దాటిన ఏకైక ఆస్ట్రేలియా ప్లేయర్ గా వార్న్ రికార్డులు క్రియేట్ చేశారు.
17 సార్లు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
2006లో, వార్న్ టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నాలుగో యాషెస్ టెస్టులో ఈ ఘనతను సాధించాడు. 17సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకొని మూడోస్థానంలో నిలిచాడు. 2007 జనవరి 7న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 55 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. 2005 యాషెస్ సిరీస్‌లో, వార్న్ ఐదు టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో వార్న్ తన బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. 17.32 సగటుతో 3,154 పరుగులు చేశాడు.