Praggnanandhaa: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద..
ఈ వార్తాకథనం ఏంటి
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై 19-9తో ఘన విజయం సాధించాడు. మంగళవారం జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌ల్లోనూ కీమర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత బ్లిట్జ్‌లో ఓ గేమ్ గెలిచి 17-3తో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. అయితే ఫలితం అప్పటికే తేలిపోయినా.. నిబంధనల ప్రకారం మిగిలిన మూడు గేమ్‌లు ఆడాల్సి వచ్చింది. ఈ మూడు గేమ్‌ల్లో కీమర్ విజయం సాధించడంతో ప్రజ్ఞానంద ఆధిక్యం కాస్త తగ్గింది. ఫైనల్‌కు చేరాలంటే కనీసం 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.
వివరాలు
టోటల్ చెస్ టోర్నీలో అర్జున్, ప్రజ్ఞానంద, వైశాలి..
తుది పోరులో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాతో ప్రజ్ఞానంద తలపడనున్నాడు.
మరో సెమీఫైనల్లో కరువానా 18-9తో అమెరికాకే చెందిన వెస్లీ సోను ఓడించాడు.
దీంతో మూడో స్థానం కోసం కీమర్, వెస్లీ సో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచే ఆటగాళ్లు వచ్చే ఏడాది గ్రాండ్ చెస్ టూర్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తారు.
బుడాపెస్ట్ (హంగేరీ): టోటల్ చెస్ పైలెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానంద, వైశాలి పోటీపడనున్నారు.
నవంబర్ 10న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 24 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
18మంది ప్లేయర్ల పేర్లు ఖరారయ్యాయి. బ్లిట్జ్, ర్యాపిడ్, ఫాస్ట్ క్లాసికల్ ఫార్మాట్లలో పోటీలు నిర్వహించనున్నారు.
వివరాలు
నాలుగు గ్రూపులుగా చేసి పోటీ..
ఇటీవల నార్వే చెస్ టైటిల్‌తో పాటు సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టైటిళ్లను గెలుచుకుని ప్రజ్ఞానంద మంచి జోరులో ఉన్నాడు.
అతడి సోదరి వైశాలి మహిళల క్యాండిడేట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేశి గత కొన్నేళ్లుగా ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో నిలకడగా రాణిస్తున్నాడు.
ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో పాటు అమెరికా స్టార్ ఆటగాళ్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో తదితరులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
మొత్తం 24 మంది ఆటగాళ్లను ఆరు మందితో కూడిన నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు.