శ్రీలకం టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌కు విశ్రాంతి.. సంజుకు చోటు..!
టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 03 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అయితే టీమిండియా విధ్వంసక బ్యాట్‌మెన్ రిషబ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చి, సంజుశాంసన్, ఇషాన్‌కిషన్‌కు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తోందట. 2022లో విఫలమైన రోహిత్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా హార్థిక్ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు సమాచారం నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌కు జట్టులో స్థానం కోసం రిషభ్ పంత్‌తోనే తీవ్ర పోటీ ఉంది.
సంజు శాంసన్ సాధించిన రికార్డులివే..
2022లో పది వన్డేలు ఆడిన సంజూ 71 సగటుతో 284 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే ఆరు టీ20లను ఆడి 44.75 సగటుతో 179 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 158.40 కావడం విశేషం. డబుల్ సెంచరీ చేసి ఈ ఏడాది భీకర ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్‌కు మాజీ ప్లేయర్ల స్థానంలో అవకాశం దక్కనుంది. దీంతో ఓ సీనియర్ ఆటగాడిపై వేటు పడే అవకాశం ఉంది. మరోపక్క ఎప్పటి నుంచో జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో భారీగా మద్దతుగా నిలుస్తున్నారు ఫాన్స్ .