శామ్ కర్రన్‌ను క్షమాపణ కోరిన విమానయాన సంస్థ
ఇంగ్లండ్ యువ క్రికెటర్ శామ్ కర్రన్ ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శామ్ కర్రన్ కు ఎయిర్ లైన్ సంస్థ క్షమాపణలు కోరుతూ ట్విట్ చేసింది. బుధవారం బ్రిటిష్ విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్ లో ప్రయాణించడానికి శామ్ కర్రన్ అసౌకర్యంగా భావించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా పోస్టు చేశాడు. విమానంలో తనకు విరిగిన సీటు కేటాయించారని, దీంతో ప్రయాణించడానికి ఇబ్బందిగా మారిందని,ఈ విమానంలో తాను ప్రయాణించనని శామ్ కర్రన్ తేల్చి చెప్పాడు. విమానయాన సంస్థ స్పందిస్తూ.. ఇది తెలిసినందుకు తాము చాలా చింతిస్తున్నామని, తమ హెల్ప్ డెస్క్ ను సంప్రదిస్తే వేరే విమానం ఏర్పాటు చేస్తారని విమానయాన సంస్థ బదులుగా ట్విట్ చేసింది.
విమానయాన సంస్థకు శామ్ కరణ్ చేసిన ట్వీట్
మినీ వేలానికి నిద్రలేని రాత్రులు గడిపిన శామ్ కర్రన్
శామ్ కర్రన్ ఐపీఎల్ మినీ వేలంలో పొందడానికి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు శామ్ కర్రన్ ను కొనుగోలు చేసింది. మినీ వేలానికి ముందు తాను చాలా నిద్రలేని రాత్రులు గడిపానని, వేలం ఎలా జరగబోతుందో అని కొంచెం ఉత్సాహంగానూ కొంచె భయంగా ఉండేదన్నారు. తాను అంత ధరకు అమ్ముపోవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని స్టార్ స్పోర్ట్స్ షో శామ్ కుర్రాన్ చెప్పాడు.