Page Loader
టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ
వెటరన్ పేసర్ శిఖా పాండే

టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2022
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది. వెటరన్ పేసర్ శిఖా పాండేను మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, ఐర్లాండ్‌ల‌తో పాటు టీమిండియా గ్రూప్ -2లో ఉంది. వివాదాస్పదంగా జట్టు నుంచి తొలగించిన శిఖా చివరిసారిగా అక్టోబర్ 2021లో భారతదేశం తరుపున ఆడింది. ప్రస్తుతం ఆమె చేరికతో పేస్ బౌలింగ్ విభాగంలో బలం చేకూరనుంది. ఆమె టీ20 ఛాలెంజర్ ట్రోఫిలో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది.

అంజలి

మహిళల ప్రపంచ్ కప్‌లో తెలుగు అమ్మాయిలు

టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి అంజలి శర్వాణి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఈ పేసర్‌ ఇటీవల ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోవడంతో ప్రపంచకప్‌ జట్టులో అవకాశం దక్కించుకుంది. అలాగే మరో తెలుగు క్రికెటర్‌, ఓపెనర్‌ సబ్బినేని మేఘనను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్‌ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధ యాదవ్‌, రేణుక ఠాకూర్‌, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే.