LOADING...
Sourav ganguly: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ

Sourav ganguly: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఆయన 54వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అరుదైన గౌరవాన్ని అందించింది. గంగూలీని ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చినట్లు ఐసీసీ ప్రకటించింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో నిర్వహించిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీంతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన 12వ భారత క్రికెటర్‌గా సౌరభ్ గంగూలీ నిలిచాడు.

వివరాలు

అత్యంత విలువైన గౌరవం..

ఈ అరుదైన గుర్తింపు తన క్రికెట్ జీవితంలో అత్యంత విలువైన గౌరవాల్లో ఒకటని గంగూలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఈ గుర్తింపు లభించేలా చేసిన ఐసీసీకి, ముఖ్యంగా ఐసీసీ ఛైర్మన్ జై షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే భారత్ తరఫున బిషన్ సింగ్ బేడి, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందుల్కర్, వినూ మన్కడ్, డయానా ఎడుల్జి, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్, మహేంద్రసింగ్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించగా, ఇప్పుడు ఆ జాబితాలో సౌరభ్ గంగూలీ కూడా చేరారు.

Advertisement