Loading...
FIFA World Cup: ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు రంగం సిద్ధం.. స్పెయిన్‌, ఫ్రాన్స్‌ మధ్య కీలక మ్యాచ్
స్పెయిన్‌, ఫ్రాన్స్‌ మధ్య కీలక మ్యాచ్

FIFA World Cup: ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు రంగం సిద్ధం.. స్పెయిన్‌, ఫ్రాన్స్‌ మధ్య కీలక మ్యాచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో మరో ఉత్కంఠభరిత సమరానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీఫైనల్‌లో మాజీ ఛాంపియన్లు స్పెయిన్‌, ఫ్రాన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఈ రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ ఈ మ్యాచ్‌లో స్వల్ప ఫేవరెట్‌గా కనిపిస్తున్నా, 2010 ప్రపంచకప్‌ ఛాంపియన్‌ స్పెయిన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. టోర్నీ మొత్తం మీద రెండు జట్లు కూడా నిలకడైన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం.

వివరాలు 

క్వార్టర్‌ఫైనల్లో మొరాకోపై ఆధిపత్యం

గ్రూప్‌-ఐలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఫ్రాన్స్‌ అగ్రస్థానంతో నాకౌట్‌కు అర్హత సాధించింది.

అనంతరం ప్రీక్వార్టర్స్‌లో స్వీడన్‌ను, క్వార్టర్‌ఫైనల్‌కు ముందు జరిగిన మ్యాచ్‌లో పరాగ్వేను ఓడించింది.

క్వార్టర్‌ఫైనల్లో మొరాకోపై ఆధిపత్యం చాటిన ఫ్రాన్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది.

మరోవైపు గ్రూప్‌-హెచ్‌లో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన స్పెయిన్‌ కూడా అద్భుత ప్రదర్శన చేసింది.

నాకౌట్‌ దశలో ఆస్ట్రియాపై విజయం సాధించిన స్పెయిన్‌, ఆ తర్వాత పోర్చుగల్‌ను మట్టికరిపించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.

అక్కడ బెల్జియంను ఓడించి ఇప్పుడు ఫ్రాన్స్‌తో కీలక పోరుకు సిద్ధమైంది.

ఆటతీరును పరిశీలిస్తే ఫ్రాన్స్‌ బలమైన దాడి విభాగంతో ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురాగల జట్టుగా నిలుస్తోంది.

మరోవైపు స్పెయిన్‌ దుర్భేద్యమైన రక్షణతో ప్రత్యేక గుర్తింపు పొందింది.

వివరాలు 

స్పెయిన్‌ విజయాల్లో లామిన్‌ యమాల్‌, రోడ్రి

ఈ టోర్నీలో ఇప్పటివరకు స్పెయిన్‌ కేవలం ఒకే ఒక్క గోల్‌ను మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చిన విషయం ఆ జట్టు డిఫెన్స్‌ బలాన్ని చాటుతోంది.

స్పెయిన్‌ విజయాల్లో యువ స్టార్‌ లామిన్‌ యమాల్‌, మిడ్‌ఫీల్డ్‌ కీలక ఆటగాడు రోడ్రి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఫ్రాన్స్‌ తరఫున కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపెతో పాటు మైఖేల్‌ ఒలీసెపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

ఈ స్టార్‌ ఆటగాళ్ల ప్రదర్శనే మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

స్పెయిన్‌ చరిత్రను మార్చి ఫైనల్‌కు చేరుకుంటుందా?

ఇప్పటివరకు స్పెయిన్‌, ఫ్రాన్స్‌ జట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మొత్తం 38 సార్లు తలపడ్డాయి.

ఇందులో ఫ్రాన్స్‌ 18 విజయాలతో ఆధిక్యంలో ఉండగా, స్పెయిన్‌ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ప్రపంచకప్‌ చరిత్రలో మాత్రం ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి.

2006 ప్రపంచకప్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ విజయం సాధించింది.

ఈసారి కూడా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక స్పెయిన్‌ చరిత్రను మార్చి ఫైనల్‌కు చేరుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT