Loading...
ICC Rankings: మిచెల్ స్టార్క్ అగ్రస్థానం.. టాప్-10లోకి రిషభ్ పంత్
మిచెల్ స్టార్క్ అగ్రస్థానం.. టాప్-10లోకి రిషభ్ పంత్

ICC Rankings: మిచెల్ స్టార్క్ అగ్రస్థానం.. టాప్-10లోకి రిషభ్ పంత్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 26, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయి. బౌలింగ్ విభాగంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడని విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అదరగొట్టిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్.. నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్క్ ఖాతాలో 872 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 861 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఒక స్థానం మెరుగుపరుచుకుని 807 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

వివరాలు

30వ స్థానానికి కేఎల్ రాహుల్..

బ్యాటింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

కేఎల్ రాహుల్ 35వ స్థానం నుంచి 30వ స్థానానికి ఎగబాకాడు. రిషభ్ పంత్ ఏకంగా ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-10లోకి ప్రవేశించాడు.

711 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇదే సమయంలో శుభ్‌మన్ గిల్ కూడా 711 పాయింట్లతో ఉన్నప్పటికీ.. ఒక స్థానం దిగజారి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు కోల్పోయాడు.

వివరాలు

428 పాయింట్లతో అగ్రస్థానంలో రవీంద్ర జడేజా..

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 874 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జో రూట్ 850 పాయింట్లతో రెండో స్థానంలో, స్టీవ్ స్మిత్ 840 పాయింట్లతో మూడో స్థానంలో, ట్రావిస్ హెడ్ 811 పాయింట్లతో నాలుగో స్థానంలో, టెంబా బవుమా 775 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు.

ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా 428 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ADVERTISEMENT