నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
శ్రీలకంతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 10 బంతుల్లో 7 పరుగులు చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాకింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇషాన్ కిషన్ 10 స్థానాలను మెరుగుపరుచుకొని 23 స్థానానికి, దీపక్ హుడా 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో హార్ధిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. ఇషన్ కిషన్ శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 37 పరుగులు చేశాడు. ఇప్పుడు 567 పాయింట్లలో 23వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. 23 బంతుల్లో 41 పరుగులు చేసినా హుడా 374 పాయింట్లతో 97వ స్థానంలో ఉండడం విశేషం.
2022లో సూర్యకుమార్ అత్యధిక పరుగులు
బౌలర్ల విభాగంలో శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరగం 709 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. అయితే ఆల్ రౌండర్ జాబితాలో కూడా 182 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. మరో స్పిన్నర్ మహేశ్ తీక్షణ బౌలింగ్ విభాగంలో 655 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ 883 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 2022లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. సూర్య 42.87 సగటుతో 1415 పరుగులు చేశాడు.