Page Loader
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి
సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2022
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన నిలిచారు. ఐసీసీఐ ప్రతిపాదించిన పురుషుల జాబితాలో సూర్య, మహిళల జాబితాలో స్మృతి మందాన చోటు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో గతేడాది 'టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుకు నామినేట్‌ అయిన భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ ఏడాది ఉత్తమ క్రికెటర్ల రేసులో నిలబడి సత్తా చాటింది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది తన అద్భుత ప్రదర్శనతో స్మృతి ఆకట్టుకుంది. టీ20 ఫార్మట్లో 2500 పరుగుల మైలురాయిని దాటి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్, టీ20 ఆసియాకప్‌ ఈవెంట్‌ల్లో అద్భుతంగా రాణించింది.

సూర్య కుమార్ యాదవ్

ఈ ఏడాది సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన 'సూర్య'

ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఏకంగా టీ20ల్లో ఒక ఏడాది 1000 పరుగులు చేసి, రెండో బ్యాటర్ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 31 మ్యాచ్‌లు ఆడి, రెండు సెంచరీలు, 9 అర్ధ శతకాలు చేశాడు. 187 స్ట్రైక్ రేటుతో 1164 పరుగులు చేశాడు. శ్రీలంకతో జనవరి 3 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికకాగా.. వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే.