మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్లుగా కప్పు కోసం అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. చివరికి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో గెలిచి మూడో ప్రపంచకప్‌ను అందుకుంది. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ మెస్సీ అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించి విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇక.. అర్జెంటీనాలో మెస్సీని దేవుడిగా పూజించి ఆరాధిస్తారు. ఈసారి తమ దేశానికి ప్రపంచకప్ అందిస్తాడని అందరూ భావించారు. మెస్సీ వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టి.. అర్జెంటీనాకు ప్రపంచ కప్‌ను అందించాడు. మెస్సీ అర్జెంటీనాలోని రోసారియో నగరంలో జన్మించాడు. 13 సంవత్సరాల వయస్సులో క్లబ్ ఫుట్‌బాల్‌లో చేరడానికి దేశం విడిచి వెళ్లాడు.
మెస్సీ ఆదాయం రూ.4వేల 952 కోట్లు
మెస్సీ జన్మించిన రోసారియో నగరంలో..తమ బిడ్డకు మెస్సీ అని పేరు పెట్టడానికి తల్లిదండ్రులకు అనుమతి లేదు. 2014లో వచ్చిన ఓ చట్టం.. ఆయన పేరును నగరంలో ఏ బిడ్డకూ పెట్టకూడదని చట్టాన్ని అమలు చేశారు. రోసారియోలో మెస్సీ పేరు ఓన్లీ.. దిగ్గజ ఆటగాడికి మాత్రమే ఉండాలి అంతేకాని ఇంకెవ్వరికి ఆ పేరు ఉండకూడదు. ఈ నగరంలో నివసించే ప్రజలు తమ పిల్లలకు మెస్సీ పేరు పెట్టకుండా నిషేధం విధించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం గమనార్హం. ఇక, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. నవంబర్ 2022 నాటికి.. లియోనెల్ మెస్సీ నికర విలువ 600 మిలియన్ డాలర్లు.. అంటే అక్షరాలా రూ.4 వేల 952 కోట్లు