LOADING...
80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్
జయదేవ్ ఉనద్కత్

80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రంజీ టోర్నిలో సంచలన రికార్డును నమోదు చేశారు. ఏ బౌలర్ కి 80 ఏళ్లుగా సాధ్యం కానీ.. రికార్డును నేటితో బద్దలు కొట్టాడు. గతేడాది దేశవాళీ క్రికెట్లో చక్కటి బౌలింగ్ తో అకట్టుకొని 12 ఏళ్ల తరువాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో ఎంపికై రెండు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లో ఉనద్కత్ బౌలింగ్‌తో రికార్డులను క్రియేట్ చేశారు. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. సౌరాష్ట్ర కెప్టెన్‌గా వేసిన తొలి ఓవర్లో వరుసుగా మూడు వికెట్లు తీసి అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు

జయదేవ్ ఉనద్కత్

రంజీ ట్రోఫి చరిత్రలో మొదటిసారి

మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్‌ ధ్రువ్‌ షోరే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ వైభవ్‌ రావల్‌ సహా యశ్‌ ధుల్‌లను పెవిలియన్‌కు పంపి, ముగ్గురినీ డకౌట్‌ చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. జయదేవ్‌ మళ్లీ రెండో ఓవర్‌లోనూ విజృంభించి, మరో రెండు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో రెండు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఉనద్కత్ రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్ లో నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. ఉనద్కత్ ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి, 20 పరుగులిచ్చి, ఆరు వికెట్లు పడగొట్టడం గమనార్హం.