LOADING...
James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు
James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు

James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫాస్ట్ బౌలర్ తన టెస్టు కెరీర్‌లో 700 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచంలో 700 వికెట్ల తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ధర్మశాలలో భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ మూడో రోజు కుల్దీప్ యాదవ్ వికెట్‌ను తీసుకోవడం ద్వారా అండర్సన్ ఈ ఘనతను అందుకున్నారు. అండర్సన్ కంటే ముందు, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ మాత్రమే టెస్ట్ ఫార్మాట్‌లో 700 వికెట్ల మార్క్‌ను దాటారు. ఫాస్ట్ బౌలర్లలో మాత్రం టెస్టుల్లో 700మార్క్‌ను చేరుకున్న తొలి ఆటగాడు అండర్సన్ మాత్రమే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అండర్సన్ అరుదైన ఘనత