Page Loader
Knife Attack: చైనా ఆసుపత్రిలో విధ్వంసకర ఘటన.. క‌త్తితో దాడి.. 10 మంది మృతి 
చైనా ఆసుపత్రిలో విధ్వంసకర ఘటన.. క‌త్తితో దాడి.. 10 మంది మృతి

Knife Attack: చైనా ఆసుపత్రిలో విధ్వంసకర ఘటన.. క‌త్తితో దాడి.. 10 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
May 07, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఈ మధ్య కాలంలో కత్తి పోటు దాడులు ఎక్కువవుతున్నాయి. చైనాలోని స్థానిక ఆసుపత్రిలో కత్తి దాడి జరిగింది. యూనన్ ప్రావిన్స్ లో ఉన్న జిన్ జియాంగ్ కౌంటిలోని స్థానిక ఆసుపత్రిలో కత్తి దాడి జరిగింది. చైనా మీడియా ఈ విషయాన్ని తెలిపింది .కత్తి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు.10 మంది మృతి చెందారు. గత ఏడాది గ్యాంగ్‌డాంగ్ స్కూల్‌లో జ‌రిగిన దాడిలో ఆరుగురు మృతిచెందిన విష‌యం తెలిసిందే. 2020లో ఓ స్కూల్‌లో జ‌రిగిన అటాక్‌లో 37 మంది చిన్నారులు గాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం జిన్ జీయాంగ్ కౌంటీ లోని ఆసుపత్రిలో ఘటనకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి.

Details

చైనాలో తుపాకుల‌పై నిషేధం

అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చైనాలో తుపాకుల‌పై నిషేధం ఉంది . దీంతో అక్క‌డ క‌త్తి పోటు దాడులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. అంతకుముందు కున్మింగ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో 33 మంది మృతిచెంద‌గా, 133 మంది గాయ‌ప‌డ్డారు. చైనా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి కత్తి దాడులు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆసుపత్రిలో కత్తితో  దాడి