South Africa Gold Mine: భూగర్భ గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఒక భూగర్భ బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనింగ్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.
ఈ కార్మికులు సౌతాఫ్రికాలోని వాయువ్య ప్రావిన్స్‌లో అక్రమంగా బంగారు గనిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
వారు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకుపోయారని, ఈ క్రమంలోనే వారు మరణించారని వెల్లడించారు.
గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు పోలీసులు పలు ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు.
మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
Details
ఆకలి, డీహైడ్రేషన్ కారణంగానే మరణాలు
కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు.
గనిలో కార్మికుల వద్ద రెండు వీడియోలు లభ్యమయ్యాయని, వాటిలో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భ గనిలో కనిపించాయని పేర్కొన్నారు.
గనిలో దాదాపు 100 మంది మరణించి ఉంటారని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను భూగర్భ గనిలో నుంచి బయటకు తీసినట్లు తెలిపారు.
ఆకలి, డీహైడ్రేషన్ కారణంగానే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.