LOADING...
Tigers died: వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే?
వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే?

Tigers died: వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఇటీవల 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్‌ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా స్పష్టం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్, హోచి మిన్ సిటీ సమీపంలోని డాంగ్ నైలో వూన్ జోయ్ జూలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ జంతువుల శాంపిల్స్‌ను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌ డయాగ్నోసిస్‌కు పంపగా, హెచ్‌5ఎన్‌1 టైప్‌ ఎ రకం కారణంగానే ఈ మరణాలు జరిగినట్లు నిర్ధారైనట్లు సమాచారం.

Details

 బందీఖానాల్లో 385 పులులు

ఈ జంతువులతో దగ్గరగా ఉన్న జూ సిబ్బంది ఏ విధమైన శ్వాసకోశ సమస్యలను అనుభవించలేదని పేర్కొన్నారు. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు బందిఖానాల్లో ఉన్నట్లు ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం పేర్కొంది. ఇందులో 310కి పైగా పులులు, ప్రైవేటు ఫారమ్‌ల జూలలో ఉండగా, మిగతావి ప్రభుత్వ కేంద్రాలలో ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. 2022 నుండి క్షీరదాల్లో ప్రాణాంతక హెచ్‌5ఎన్‌1, ఇతర ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.