ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్ రాజధానికి నైరుతి దిశలోని కొన్ని ప్రాంతాలను భారీ భూకంపం వణికించింది. హుకే సమీపంలో 6.2 తీవ్రతతో గురువారం ఉదయం భూమి కంపించినట్లు యూఎస్ U.S. జియోలాజికల్ సర్వే చెప్పింది. హుకే ఉపరితలం నుంచి 120 కిలోమీటర్ల లోతులో ఇది కేంద్రీకృతమైంది. లోతైన భూకంపాలు ఎక్కువ ప్రాంతాలకు విస్తరిస్తాయి. కానీ వాటి వల్ల నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పటివరకు నివేదించలేదని ఫిలిప్పీన్స్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ చెప్పింది. ఫిలిప్పీన్స్‌లో అత్యంత చురుకైన మయోన్ అగ్నిపర్వతం ప్రస్తుతం విస్ఫోటనం చెందుతోంది. దీని పర్యావసానంగా భూకంపం సంభవించింది.