
US: దారుణం.. 10 మంది ప్రాణాలు తీసిన నర్సు
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా(US)దారుణం జరిగింది. ఓ నర్స్(Nurse)చేసిన పని వల్ల దాదాపు 10మంది అమాయక రోగులు మరణించారు.
ఒరెగాన్‌లోని ఒక ఆసుపత్రి(Hospital)లో నర్సు రోగులకు ఇచ్చిన మందులను అపహరించి.. వాటి స్థానంలో టాప్ నీటిని ఇంజెక్ట్ చేసింది.
ఈ చర్యతో 10మంది రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గత నెల ప్రారంభంలో ఒక మాజీ ఉద్యోగి మందులను దొంగిలించాడని ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణలో ఈ నర్సు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే పెయిన్ కిల్లర్ మందు ఫెంటానిల్‌ను దొంగతనం చేసి.. ఆ సీసాల్లో డ్రిప్ వాటర్‌ను నింపి, రోగులకు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
దీని కారణంగా, 2022 నుంచి 10మంది రోగులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టాప్ వాటర్‌ను ఇంజెక్ట్ చేసిన నర్సు
Ten patients were killed after a nurse allegedly replaced fentanyl intravenous drips with tap water at an Oregon hospital.https://t.co/ivtzgkcoKz
— IndiaToday (@IndiaToday) January 6, 2024