Page Loader
అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి 
అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి

అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. సౌత్‌ఫోర్క్ డైరీ ఫామ్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18,000 కంటే ఎక్కువ ఆవులు మరణించాయి. ఈ సంఘటన అమెరికా చరిత్రలోనే భయంకరమైన అగ్నిప్రమాదాల్లో ఒకటని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పొలం యజమాని ఈ సంఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు. క్యాస్ట్రో కౌంటీ షెరీఫ్ ఆఫీస్ షేర్ చేసిన చిత్రాల్లో మంటలు ఒక భవనం గుండా వ్యాపిస్తున్నట్లు అందులో కనపడింది. కాలిపోతున్న భవనంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ప్రజారోగ్యం, భద్రత నిమిత్తం పొలానికి వెళ్లే అన్ని రహదారులను మూసివేసినట్లు అధికారులు చెప్పారు.

అమెరికా

దశాబ్దకాలంలో 6.5 మిలియన్ల జంతువులు మృతి

టెక్సాస్‌లోనే అతిపెద్ద పాల ఉత్పత్తి కౌంటీగా సౌత్‌ఫోర్క్ డైరీ ఫామ్స్‌‌కు పేరుంది. దీంతో అంతపెద్ద ఫామ్స్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. 2013లోనూ ఇలాంటి భారీ ప్రమాదమే జరిగినట్లు జంతు సంక్షేమ సంస్థ (ఏడబ్య్లూఐ) తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఇలాంటి మంటల్లో చిక్కుకొని దాదాపు 6.5 మిలియన్ల జంతువులు చనిపోయినట్లు ఏడబ్య్లూఐ వెల్లడించింది. అందులో పాలిచ్చే ఆవులు ఎక్కువగా ఉండటం గమనార్హం.