
BBC: టీనేజర్ అసభ్యకర ఫొటోల కోసం 45వేల డాలర్ల చెల్లించిన బీబీసీ యాంకర్; ఉద్యోగం నుంచి తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
నగ్న ఫోటోల కోసం ఒక టీనేజర్‌కు వేలాది ఫౌండ్లు చెల్లించారన్న ఆరోపణల నేపథ్యంలో తమ బ్రాడ్ కాస్టర్ నుంచి ప్రముఖ న్యూస్ యాంకర్‌ను సస్పెండ్ చేసినట్లు బీబీసీ తెలిపింది.
దీనికి సంబంధించిన ఫిర్యాదు మే నెలలో అందినట్లు బీబీసీ ధృవీకరించింది.
యునైటెడ్ కింగ్‌డమ్ కేంద్రంగా పని చేస్తున్న 'ది సన్' వార్తాపత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఓ యువకుడి న్యూడ్ ఫొటోల కోసం అతనికి ఇప్పటి వరకు 45,000డాలర్లను బీబీసీలోని మగ ప్రెజెంటర్ చెల్లించాడని 'ది సన్' ఆరోపించింది.
ఆ యువకుడికి 17సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అంటే 2020నుంచి అతని న్యూడ్ ఫోటోల కోసం బీబీసీ ప్రెజెంటర్ డబ్బులు చెల్లిస్తున్నారని పేర్కొంది.
ఈ వ్యవహారాన్ని బీబీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది.
బ్రిటన్
18 ఏళ్లలోపు టీనేజర్ల నగ్న ఫొటోలు కలిగి ఉంటే బ్రిటన్‌లో నేరం
బ్రిటన్‌లో లైంగిక సమ్మతి వయస్సు 16 ఏళ్లు అయినప్పటికీ, 18 ఏళ్లలోపు వారివి నగ్న ఫోటోలు కలిగి ఉంటే నేరంగా పరిగణిస్తారు.
ఇలాంటి ఆరోపణలనైనా బీబీసీ చాలా సీరియఎస్‌గా తీసుకుంటుందన్న విషయం తమకు తెలుసునని 'ది సన్' వార్తాపత్రిక తెలిపింది.
బీబీసీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.
ఈ వ్యవహారంపై యూకే కల్చర్ సెక్రటరీ లూసీ ఫ్రేజర్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవితో సంక్షోభ చర్చలు జరిపారని బీబీసీ వెల్లడించింది.
'ది సన్' వార్తాపత్రిక కథనం బయటకు వచ్చిన తర్వాత బీబీసీలోని యాంకర్లను సోషల్ మీడియా వేదికగా తమ వివరణలను విడుదల చేశారు.