LOADING...
China: పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!
పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!

China: పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు నవంబర్‌ 1 నుండి అమలులోకి రాబోతాయి. ట్రంప్ ఈ నిర్ణయంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకోగలని కూడా పేర్కొన్నారు. తాజాగా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ చర్యపై స్పందించింది. అమెరికా సుంకాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చైనా దేశ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా సాధారణంగా ఎవరితో ఘర్షణకు దిగదని, అవసరం అయితే మాత్రమే పోరాటానికి వెనకాడమని స్పష్టం చేసింది.

Details

గతంలోనూ అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం

అలాగే ప్రతిచర్యలు (counter-measures) కూడా ఉంటాయని హెచ్చరించింది. చైనా ప్రకారం, అమెరికా ఏకపాక్షిక నిర్ణయాలు తీసుకోవడం, ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చలకు దెబ్బతీస్తుంది. గతంలోనూ అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వివాదాన్ని తగ్గించడానికి ఇరుదేశాలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొన్ని ట్రేడ్ డీల్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డప్పటికీ, అవి పూర్తిగా విజయవంతమయ్యే స్థాయికి రాలేదు. తాజా పరిణామాలు ఈ వాణిజ్య ఉద్రిక్తతను మరింత బలపరిచినట్టు తెలుస్తోంది.