LOADING...
King Charles III of Britain: ఉరిశిక్ష అమలైన ఏడు దశాబ్దాల తర్వాత మహిళకు క్షమాభిక్ష
ఉరిశిక్ష అమలైన ఏడు దశాబ్దాల తర్వాత మహిళకు క్షమాభిక్ష

King Charles III of Britain: ఉరిశిక్ష అమలైన ఏడు దశాబ్దాల తర్వాత మహిళకు క్షమాభిక్ష

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏడు దశాబ్దాల క్రితం ఉరిశిక్ష అమలైన ఓ మహిళకు తాజాగా బ్రిటన్ రాజు ఛార్లెస్-III షరతులతో కూడిన క్షమాభిక్ష మంజూరు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన సిఫారసును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని బుధవారం ప్రకటించారు. రూత్ ఎల్లిస్ అనే మహిళపై తన స్నేహితుడు డేవిడ్ బ్లేక్‌లీ హత్య కేసులో నేరం రుజువుకావడంతో ఆమెకు మరణదండన విధించారు. అనంతరం 1955 జూలై 13న ఆమెకు ఉరిశిక్ష అమలు చేశారు. అయితే విచారణ సమయంలో రూత్ ఎల్లిస్ ఎదుర్కొన్న గృహహింస, మానసిక వేదన, తీవ్ర క్షోభ వంటి కీలక పరిస్థితులను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని ఆమె నలుగురు మనవళ్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

వివరాలు

ఆమె కుటుంబానికి కొంతమేర మానసిక ఊరట..

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు మరణానంతరం క్షమాభిక్ష ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఉపప్రధాని, న్యాయశాఖ కార్యదర్శి డేవిడ్ లామ్మీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, గత 70 సంవత్సరాలుగా రూత్ ఎల్లిస్ జీవిత గాథకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో జరిగిన ఘటనను ఇప్పుడు మార్చడం సాధ్యం కాకపోయినా, ఇది అసాధారణ పరిస్థితులతో కూడిన కేసుగా గుర్తించి షరతులతో కూడిన క్షమాభిక్ష ఇవ్వడం ద్వారా ఆమె కుటుంబానికి కొంతమేర మానసిక ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement