Loading...
Billboards Hacked: బిల్‌బోర్డ్స్‌ హ్యాక్‌.. ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలు!
బిల్‌బోర్డ్స్‌ హ్యాక్‌.. ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలు!

Billboards Hacked: బిల్‌బోర్డ్స్‌ హ్యాక్‌.. ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రకటనలు ప్రసారం కావాల్సిన స్క్రీన్లపై అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో యాడ్‌ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఇంతకీ ఈ సైబర్‌ దాడి ఎలా జరిగింది? హ్యాకర్ల ఉద్దేశం ఏమిటి?

వివరాలు 

ఐదు దేశాల్లో కలకలం..

ఈజిప్ట్‌, మలేషియా, బ్రెజిల్‌, చైనా, ఇరాక్‌ దేశాల్లోని డిజిటల్‌ బిల్‌బోర్డులను గతవారం హ్యాకర్లు హైజాక్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి.

ఈజిప్ట్‌ రాజధాని కైరోలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై ఉన్న ఓ బిల్‌బోర్డ్‌పై ఈ దృశ్యాలు కనిపించాయి.

దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేసి,సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బిల్‌బోర్డుకు సంబంధించిన కంపెనీ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరిగినట్లు ఈజిప్ట్‌ ప్రభుత్వం వెల్లడించింది.

అనధికారిక వీడియోలు ఒకేసారి పలు దేశాల్లో ప్రసారమైనట్లు తెలిపింది.ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.

వివరాలు 

సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఆసరాగా చేసుకుని..

అయితే, సంబంధిత కంపెనీ పేరు, ప్రభావితమైన దేశాల వివరాలను మాత్రం వెల్లడించలేదు.

డిజిటల్‌ బిల్‌బోర్డుల్లోకి చొరబడేందుకు తమకు కొన్ని గంటల సమయం మాత్రమే పట్టిందని Leakers$ పేరుతో టెలిగ్రామ్‌లో ఉన్న హ్యాకర్ల బృందం ప్రకటించుకుంది.

ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రకటనలు ప్రసారం చేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్నట్లు తెలిపింది.

మలేషియా, బ్రెజిల్‌లోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల్లోని ప్రకటనల సంస్థలు వెంటనే బిల్‌బోర్డులను స్విచ్ఛాఫ్‌ చేశాయి.

ADVERTISEMENT

వివరాలు 

డబ్బు కోసం కాదు.. భద్రతా లోపాలను ఎత్తిచూపేందుకే!

ఈ సైబర్‌ దాడుల వెనుక డబ్బు సంపాదించడం లేదా ఎవరినైనా బెదిరించడం తమ ఉద్దేశం కాదని హ్యాకర్లు ప్రకటించడం గమనార్హం.

ప్రకటనల సంస్థలు తమ మౌలిక సదుపాయాల కోసం లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఇంటర్నెట్‌కు అనుసంధానించిన డిజిటల్‌ స్క్రీన్లకు తగిన భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు.

భద్రతా లోపాలున్న స్క్రీన్లను సులభంగా హ్యాక్‌ చేయవచ్చని నిరూపించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ క్రమంలోనే చైనా, ఇరాక్‌లోని బిల్‌బోర్డులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT