LOADING...
Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి
ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి

Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు. ఆయన మరణించిన విషయాన్ని ఖతార్ అధికారిక వార్తా సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఆయన మృతితో ఖతార్‌తో పాటు అంతర్జాతీయ వేదికపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సుమారు 18 సంవత్సరాల పాటు ఖతార్ పాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. తన పాలనా కాలంలో దేశ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, సహజ వాయువు, ఇంధన వనరులను సమర్థంగా వినియోగించి ఖతార్‌ను ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో ఖతార్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది.

వివరాలు 

2013లో పాలక పదవి నుంచి తప్పుకున్న హమద్

2013లో స్వచ్ఛందంగా పాలక పదవి నుంచి తప్పుకున్న హమద్, తన కుమారుడికి అధికార బాధ్యతలు అప్పగించారు. అధికార మార్పిడి ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించిన నాయకుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. షేక్ హమద్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంత అభివృద్ధికి, ఖతార్‌ను ఆధునిక, సంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement