LOADING...
US-Iran Strikes: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు.. గల్ఫ్ దేశాల్లో అత్యవసర హెచ్చరికలు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు.. గల్ఫ్ దేశాల్లో అత్యవసర హెచ్చరికలు

US-Iran Strikes: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ఉద్రిక్తతలు.. గల్ఫ్ దేశాల్లో అత్యవసర హెచ్చరికలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హొర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వైమానిక దాడులు జరపగా, అందుకు ప్రతీకారంగా అమెరికా బుధవారం తెల్లవారుజామున ఇరాన్‌పై దాడులు నిర్వహించింది. అనంతరం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా, ఇరాన్ బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఎదురుదాడులకు దిగింది.

వివరాలు

భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం..

ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంత దేశాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బహ్రెయిన్, కువైట్ ప్రభుత్వాలు క్షిపణి, డ్రోన్ ముప్పు నేపథ్యంలో అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. సైరన్‌లు మోగించిన అధికారులు ప్రజలు వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అవసరం లేని పరిస్థితుల్లో బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వాలు జారీ చేస్తున్న భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు కూడా తమ భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేశాయి.

Advertisement