Page Loader
America: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం 
అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

America: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం 

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి దాడికి గురయ్యాడు. జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తి వల్పరైసో నగరంలోని పబ్లిక్ జిమ్‌లో భారతీయ విద్యార్థి వరుణ్‌ ఉండగా కత్తితో దారుణంగా దాడి చేశాడు. వరుణపై ఎందుకు దాడి చేశాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోందని అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆండ్రేడ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాడి అనంతరం వరుణ్‌ను ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు, అయితే అతను బతికే అవకాశాలు 5శాతం మాత్రమే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు పీటీఐ వార్తాసంస్థ నివేదించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరుణ్ బతికే అవకాశాలు 0 నుంచి 5శాతం మాత్రమే: వైద్యులు