Hormuz: ఒమన్ కారిడార్‌పై ఇరాన్ అభ్యంతరం.. హర్మూజ్‌లో చిక్కుకున్న 9 భారత ట్యాంకర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఒమన్ కారిడార్ ద్వారా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్ భద్రతా బలగాలు వెనక్కి మళ్లించినట్లు సమాచారం. అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఒమన్ కారిడార్‌ను ఉపయోగించకుండా, హర్మూజ్ జలసంధిలో తమ సూచించిన మార్గాన్నే అనుసరించాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సూచించినట్లు తెలుస్తోంది.
వివరాలు
హర్మూజ్‌లో చిక్కుకున్న 9 భారత ట్యాంకర్లు..
జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పర్షియన్ గల్ఫ్‌లో తొమ్మిది భారత ట్యాంకర్లు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నౌకల్లో మొత్తం 198 మంది భారత నావికులు ఉన్నారని తెలుస్తోంది. వాటిలో కొన్ని పూర్తి స్థాయిలో చమురు, గ్యాస్‌తో నిండిన నౌకలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. నౌకలు, సిబ్బంది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకునేందుకు ఇరాన్‌తో సంప్రదింపులు జరిపే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.