LOADING...
Netanyahu: నెతన్యాహూ మ‌ర‌ణించారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో ఇదే!
నెతన్యాహూ మ‌ర‌ణించారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో ఇదే!

Netanyahu: నెతన్యాహూ మ‌ర‌ణించారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలను రేకెత్తించింది. మార్చి 13న నెతన్యాహూ షేర్ చేసిన వీడియోలో ఆయన చేతిలో ఆరు వేళ్లున్నట్లు కనిపించడంతో ఈ వీడియో AIసాయంతో చేశారా? అనే ప్రశ్నలు పెరిగాయి. వినియోగదారులు ఈవీడియోను గమనించి, నెతన్యాహూ ఎక్కడ ఉన్నారో అని ప్రశ్నిస్తున్నారు. వీడియోలో ఆయన ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్‌పై కొనసాగిస్తున్న దాడుల గురించి వ్యాఖ్యానిస్తుండగా, ఇరాన్ పూర్వపు సుప్రీం నేత ఆయతల్లో అలీ ఖమేనీ మరణించిన తర్వాత, పొరుగున ఉన్న యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్‌లపై ప్రతీకార దాడులు చేస్తున్న విషయం, హార్ముజ్ జలసంధి మూసివేసి చమురు సరఫరాకు ప్రభావం చూపిన అంశాలను ప్రస్తావించారు.

Details

అస‌త్య ప్ర‌చార‌మ‌ని ధ్రువీక‌ర‌ణ

అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత కాండేస్ ఓవెన్స్ కూడా నెతన్యాహూ అసలు ఎక్కడ ఉన్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆమె బీబీ ఎక్కడ? అని ప్రశ్నిస్తూ, నెతన్యాహూ కార్యాలయం AI-సాయంతో రూపొందించిన వీడియోలను ఎందుకు విడుదల చేస్తోందో, వాటిని తొలగించడంలో ఎందుకు వైట్ హౌస్‌లో ఆందోళనలు ఉన్నాయో అడిగారు. అయితే AI ఫ్యాక్ట్-చెక్ బాట్ 'గ్రోక్' తెలిపింది. నెతన్యాహూ సాధారణంగా ఐదు వేళ్లే ఉన్నారని, ఈ వీడియోలో కెమెరా యాంగిల్, వెలుతురు కారణంగా ఆరు వేళ్లు ఉన్నట్లు భ్రమ కలిగిందని 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్', ఇతర ఫ్యాక్ట్-చెక్ సంస్థలు కూడా నెతన్యాహూ మరణించాడని ప్రచారం అసత్యమని ధ్రువీకరించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైర‌ల్ అవుతున్న వీడియో ఇదే

Advertisement