Loading...
Flydubai Plane: హైజాక్ భయంతో ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ 
హైజాక్ భయంతో ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్

Flydubai Plane: హైజాక్ భయంతో ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో పైలట్‌పై జరిగిన దాడి ఘటన ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. నిర్దేశిత మార్గం నుంచి విమానం తప్పిపోవడం, కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైందని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విమానాన్ని కూల్చివేసేందుకు యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది.

వివరాలు 

విమానాన్ని కూల్చేందుకు సిద్ధం చేసిన యుద్ధ విమానాలు

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో దాడి జరిగిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.

దాడి జరిగిన సుమారు 30 సెకన్లలోనే విమానం 34 వేల అడుగుల ఎత్తు నుంచి దాదాపు 16వేల అడుగుల దిగువకు పడిపోయింది.

అదే సమయంలో విమానం నుంచి అత్యవసర కోడ్‌ కూడా ప్రసారమైంది.ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ అధికారులు ఆందోళనకు గురయ్యారు.

విమానం హైజాక్‌కు గురైందా?లేక తమ దేశంపై దాడి చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా?అనే అనుమానాలు తలెత్తాయి.

విమానంతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రయత్నించినప్పటికీ కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో అక్కడి అత్యవసర వ్యవస్థను అప్రమత్తం చేశారు.ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి యుద్ధ విమానాలను రంగంలోకి దించారు.

వివరాలు 

టెల్‌అవీవ్‌ వైపు వస్తే ఏం చేసేవారు?

ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ తన గగనతలాన్ని కూడా మూసివేసింది.

అయితే కొద్దిసేపటి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది.ఫ్లైదుబాయ్ విమానం సౌదీ అరేబియా వైపు అత్యవసరంగా దారి మళ్లడంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను వెనక్కి పిలిచింది.

ఇదే సమయంలో సౌదీ అరేబియా కూడా తమ యుద్ధ విమానాలను మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది.

ఫ్లైదుబాయ్ విమానం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ టెల్‌అవీవ్‌ వైపు దూసుకొచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారేదని ఆ కథనం తెలిపింది.

యుద్ధ విమానాల పైలట్లు ఫ్లైదుబాయ్ విమానానికి దగ్గరగా వెళ్లి,కాక్‌పిట్‌లో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.

విమానం హైజాక్‌కు గురైనట్లు నిర్ధారణ అయితే ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణమంత్రికి తెలియజేసేవారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లైదుబాయ్‌లో చేరకముందే దాడికి ప్లాన్?

దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందని భావించిన సందర్భంలో విమానాన్ని కూల్చివేయాలని ఆదేశించే అధికారం ప్రధానికి ఉంటుందని కథనం వెల్లడించింది.

ఇప్పటికే ఇజ్రాయెల్ దర్యాప్తు వర్గాలు కోపైలట్‌కు సంబంధించిన ప్రణాళికపై కీలక వివరాలను వెల్లడించాయి.

టెల్‌అవీవ్‌లోని ఎత్తైన భవనాలు, బెన్ గురియన్ విమానాశ్రయం అతడి లక్ష్యాల్లో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.

గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలకు ప్రతీకారంగానే కోపైలట్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం.

అయితే టెల్‌అవీవ్‌లో విమానాన్ని కూల్చే ప్రయత్నం విఫలమైతే మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా అతడు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లైదుబాయ్‌లో చేరకముందే దాడికి ప్లాన్?

జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం కూడా అతడి లక్ష్యాల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఒమన్‌కు చెందిన కోపైలట్ ఈ ఏడాది ప్రారంభంలో టెల్‌అవీవ్‌కు వెళ్లిన మరో విమానంలోనూ విధులు నిర్వర్తించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

ఆ సమయంలోనే ఆ విమానాన్ని హైజాక్ చేసి కూల్చివేయాలని అతడు ఆలోచించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

అయితే విమానంలో తనకు పరిచయమున్న వ్యక్తి ఉండటంతో ఆ సమయంలో ఆ ప్రణాళికను విరమించుకున్నట్లు తెలుస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ దాడికి సంబంధించిన ప్రణాళికలను తాను ఫ్లైదుబాయ్ సంస్థలో చేరకముందే సిద్ధం చేసుకున్నట్లు కోపైలట్ దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

దీంతో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు మరిన్ని కీలక అంశాలపై కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT