Page Loader
Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య 
Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య

Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య 

వ్రాసిన వారు Stalin
Feb 20, 2024
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పోర్న్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. కాగ్నీ లిన్ కార్టర్ ఇటలీలోని తన ఇంట్లో శవమై కనిపించింది. 36ఏళ్ల కాగ్నీ లిన్ కార్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఆత్మహత్యతో ఆమె తనువు చాలించినట్లు పేర్కొన్నారు. కాగ్నీ 2000 నుంచి పోర్న్ ఇండస్ట్రీలో చాలా చురుగ్గా ఉన్నారు. కాగ్నీ మొదట పోల్ డ్యాన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. దీని తర్వాత ఆమె లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరింది. కాగ్నీ ఆకస్మిక మరణంతో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.

ఆత్మహత్య

అంత్యక్రియల కోసం డబ్బును సేకరిస్తున్న స్నేహితులు

కాగ్నీ లిన్ కార్టర్ మరణ వార్తను ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే తొలుత ఆమె మరణవార్తను పుకారు అనుకున్నారు. కానీ పోలీసులు అధికారంగా ప్రకటించడంతో ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా కాగ్నీకి నివాళులు అర్పిస్తున్నారు. అయితే తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉండే కాగ్నీ ఫిబ్రవరి 11న తన చివరి పోస్టును పెట్టింది. ఇదిలా ఉంటే, కాగ్నీ అంత్యక్రియల కోసం ఆమె స్నేహితులు డబ్బును సేకరిస్తున్నారు.