Page Loader
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా! 
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా! 

వ్రాసిన వారు Stalin
Feb 28, 2024
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అధికార డెమోక్రటిక్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో బైడెన్‌ బదులుగా.. మాజీ ప్రెసిడెంట్ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా పోటీ చేయాలని అమెరికన్లు కోరుకుంటున్నట్లు రాస్‌ముస్సెన్‌ రిపోర్ట్స్‌ పోల్‌ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బైడెన్‌ పోటీ చేయాడనికి డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు, అమెరికన్లు ఇష్టపడటం లేదు.

అమెరికా

మిషెల్‌ ఒబామాకు మద్దుతుగా 20శాతం

బైడెన్ వృద్ధాప్యం, ఆయన మానసిక ఆరోగ్య స్థితి దృష్ట్యా దాదాపు 48శాతం మంది బైడెన్‌ మరోసారి అధ్యక్ష రేసులో ఉండటాన్ని ఇష్టపడటం లేదని రాస్‌ముస్సెన్‌ రిపోర్ట్స్‌ పోల్‌ చేసిన సర్వేలో తేలింది. ఈ క్రమంలో 33 శాతం మంది బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని నిలబెట్టాలని అభిప్రాయపడ్డారు. బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరు నిలబడాలని భావిస్తున్నారని పోల్ నిర్వహించగా.. అందులో మెజార్టీ మంది ప్రజలు ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా వైపే మొగ్గు చూపారు. ఈ పోల్‌లో వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌, హిల్లరీ క్లింటన్‌, గావిన్ న్యూసోమ్, గ్రెచెన్ విట్మర్, మిషెల్‌ ఒబామా పేర్లను ఉంచారు. వీరిలో 20శాతం మంది మిషెల్‌‌కు, కమలా హారిస్‌‌కు 15శాతం, హిల్లరీ క్లింటన్‌కు 12శాతం మంది ఓటేశారు.