Nepal: నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదలు.. 384 మంది పర్యాటకులు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌ను ఆకస్మికంగా సంభవించిన మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్కసారిగా నది ఉప్పొంగడంతో భారీగా వరద నీరు ప్రవహించి పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో మొత్తం 384 మంది పర్యాటకులు ఆచూకీ లేకుండా పోయినట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. గల్లంతైన వారిలో 291 మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
వివరాలు
గల్లంతైన వారిలో 37 మంది ప్రవాస భారతీయులు
అదేవిధంగా 37 మంది ప్రవాస భారతీయులు కూడా గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం.
మరో 93 మంది నేపాల్ జాతీయులు ఆచూకీ లేకుండా పోయినట్లు వెల్లడైంది.
ప్రభావిత ప్రాంతంలోని ట్రావెల్ ఏజెన్సీలు అందించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ప్రాథమికంగా వెల్లడించినట్లు నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది.
గల్లంతైన వారి సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదలు
#BREAKING At least 384 tourists, including 291 foreigners, out of contact after flash floods, mudslides hit near border port with China, says Nepal Tourism Board pic.twitter.com/X7696DtEWC
— Anadolu English (@anadoluagency) August 26, 2026