LOADING...
Virgin Girl Consent: తాలిబాన్‌లో కొత్త చట్టం సంచలనం.. బాల్య వివాహాలకు ఆఫ్ఘనిస్తాన్‌లో చట్టబద్ధత
తాలిబాన్‌లో కొత్త చట్టం సంచలనం.. బాల్య వివాహాలకు ఆఫ్ఘనిస్తాన్‌లో చట్టబద్ధత

Virgin Girl Consent: తాలిబాన్‌లో కొత్త చట్టం సంచలనం.. బాల్య వివాహాలకు ఆఫ్ఘనిస్తాన్‌లో చట్టబద్ధత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ పాలన మరింత కఠినంగా మారుతోంది. తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త కుటుంబ చట్ట నిబంధనల ద్వారా బాల్య వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు కల్పించినట్లు వెల్లడైంది. "స్పౌసెస్ మధ్య విభజన సూత్రాలు" (Principles of Separation Between Spouses) పేరుతో రూపొందించిన ఈ 31 ఆర్టికల్‌ రెగ్యులేషన్‌ను తాలిబన్‌ అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించారు. అనంతరం దీనిని అధికారిక గెజెట్‌లో ప్రచురించారు.

వివరాలు

బాల్య వివాహాలకు చట్టబద్ధత

కొత్త నిబంధనల ప్రకారం, తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువులు ఒక చిన్నారి అబ్బాయి లేదా అమ్మాయి వివాహాన్ని ఏర్పాటు చేసినా.. ఆ జంట సామాజికంగా సరిపోతే, మహర్‌ (కట్నం) సముచితంగా ఉంటే ఆ వివాహాన్ని చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. యౌవనం వచ్చిన తర్వాతే రద్దు అవకాశం ఈ చట్టం ప్రకారం, చిన్నారి యౌవన దశకు చేరుకున్న తర్వాత మాత్రమే కోర్టు ద్వారా వివాహాన్ని రద్దు చేయించుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు

'మౌనం'నే అంగీకారంగా పరిగణింపు

కొత్త నిబంధనల్లో కన్యల (Virgin Girls) విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఒక కన్య మౌనం వహిస్తే, దానిని వివాహానికి అంగీకారంగా భావించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. తాలిబన్‌ వర్గాల ప్రకారం ఈ నిబంధనలు ఇస్లామిక్‌ హనఫీ జ్యురిస్‌ప్రూడెన్స్‌ ఆధారంగా రూపొందించారు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలు సాధారణంగానే ఉన్నప్పటికీ.. తాజా రెగ్యులేషన్‌ వాటికి స్పష్టమైన చట్టబద్ధత కల్పించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

మహిళల హక్కులపై ఆందోళనలు

తాలిబన్‌ పాలనలో ఇప్పటికే బాలికల విద్యపై నిషేధాలు, ఆర్థిక సంక్షోభం, ఆకలి వంటి సమస్యల కారణంగా బాల్య వివాహాలు పెరిగాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, దేశంలో సుమారు 29 శాతం అమ్మాయిలు 18 ఏళ్లలోపే వివాహం చేసుకుంటున్నారు. ఈ కొత్త చట్టం మహిళల హక్కులపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యాక్టివిస్ట్‌ మార్జియా హమీది ఈ నిర్ణయాన్ని "అసహ్యకరమైనది, అమానుషమైనది"గా తీవ్రంగా విమర్శించారు.

Advertisement

వివరాలు

పాత విడాకుల కేసులపై కూడా ప్రభావం

కొత్త నిబంధనల కారణంగా గతంలో నమోదైన కొన్ని విడాకుల కేసులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే బాల్య వధువులను తిరిగి భర్తల వద్దకు పంపించే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్‌ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే విద్య, ఉపాధి, వ్యక్తిగత స్వేచ్ఛలపై ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్‌ మహిళలు, బాలికల పరిస్థితి మరింత దిగజారుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement