Pakistan: ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది పసికందులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో మంటలు చెలరేగడంతో 15 మంది అప్పుడే పుట్టిన శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినట్లు జియో న్యూస్ తెలిపింది. నర్సరీలోని ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని సహాయక సిబ్బంది తెలిపారు.
వివరాలు
ఉదయం 7 గంటల సమయంలో మంటలు
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో PIMS గైనకాలజీ వార్డులో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు వార్డులో ఉన్న రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంటలు పూర్తిగా ఆర్పివేసిన తర్వాత కూడా అక్కడ సహాయక బృందాలు చల్లబరిచే చర్యలు చేపట్టాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్లామాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
BREAKING NEWS | At least 14 newborn babies dead in fire at Pakistan hospital’s maternity ward https://t.co/bYB8ae9jXr
— The Independent (@Independent) August 26, 2026